25 July, 2026 | 5:30 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం

25-07-2026 04:55 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో ప్రతి ఓటరికి ఒక్కటే ఓటు ఉండేలా డబుల్ ఓట్ల నివారణ కోసం చేపట్టిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (సర్) ప్రక్రియ నిర్వహణలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ఇందుకు రాజకీయ పార్టీలు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ఓటర్ల జాబితాలో పేర్ల సవరణలు, చిరునామా మార్పులు, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపులను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరుగుతుందని సూచించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని తెలిపారు.

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో కొన్ని వార్డుల్లో నమోదు తక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ 84.12 శాతం పూర్తి కాగా, పురపాలక పరిధిలో 70 శాతం మాత్రమే నమోదైందని, దీనిని వేగవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. సర్ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీతో ముగియనున్నందున అర్హులైన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, భూపాలపల్లి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎన్నికల విభాగం డిటి అబ్బాస్, నవీన్ తదితరులు పాల్గొని తమ సూచనలు వెల్లడించారు.