విద్యాశాఖ నా వద్దే ఉంది: సీఎం రేవంత్
ఢిల్లీ: తెలంగాణ కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణలో ఏ శాఖ లేదన్న సీఎం రాష్ట్రంలోని అన్ని శాఖలకు మంత్రులున్నారని పేర్కొన్నారు. ఊహాజనిత ప్రచారంతో గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ తన దగ్గరే ఉందన్న సీఎం ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. విద్యాశాఖపై ఎన్నో సమీక్షలు చేశానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఒక్కడే ప్రమాణస్వీకారం చేసి కొన్ని నెలలపాటు మంత్రులను పెట్టుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేరో చూడాలని కోరారు. అభివృద్ధి పనుల కోసం మత్రులు కేంద్రమంత్రులను కలుస్తున్నారని వివరించారు.






