శాంతిఖని లో ప్రమాదం.. ఒకరికి స్వల్ప గాయాలు
15-06-2026 05:20 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని బొగ్గు గనిలో మొదటి షిప్టులో గని ప్రమాదం లో ఓ కార్మికుడికి స్వల్ప గాయమైంది. వివరాలిలా ఉన్నాయి. 37 లెవల్లో సోము అనే జనరల్ అసిస్టెంట్ కార్మికుడు సపోర్టింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో సపోర్టింగ్ కోసం డ్రిల్ చేసి బోల్ట్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు చేతివేలు అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో చేతి వేలికి తీవ్రంగా గాయమైంది. వెంటనే తోటి కార్మికులు గాయపడిన కార్మికుడిని గని ఉపరితలానికి తీసుకొచ్చారు. అధికారులు సదరు కార్మికుడిని వెంటనే బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్స అందించారు.






