16-07-2025 01:15:46 AM
అజెండా మారిస్తేనే సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు సుముఖంగా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము సమావేశానికి వచ్చేది లేదని కేంద్రానికి లేఖ రాసింది.
ఈ సమావేశం అజెండా మారిస్తే తాము కూడా హాజరవుతామని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి తెలిపారు. అయినప్పటికీ సీఎం రే వంత్‌రెడ్డి ఢిల్లీకి మంగళవారం రాత్రి హుటాహుటిన వెళ్లారు. ఇరు రాష్ట్రా ల సీఎంల సమావేశం కోసమే ఆయ న ఢిల్లీకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కృష్ణానదిపై పెం డింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతం లో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రా జెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద ని ర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పా టు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వ ద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మా ణం తదితర అంశాలతో కూడిన అం శాలు సమావేశం అజెండాలో చేర్చాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలను పంపించింది.