నేడు సిరిసిల్లకు రేవంత్ రెడ్డి
03-05-2024 02:01 AM
బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం
రాజన్న సిరిసిల్ల, మే 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జన జాతర సభలో పాల్గొననున్నారు. బైపాస్ రోడ్డులో కాంగ్రెస్ శ్రేణులు సభాస్థలాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. బహిరంగ సభాస్థలి, సీఎం ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్ స్థలాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.




