10 June, 2026 | 1:11 AM

ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

10-06-2026 12:17 AM

విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి పిలుపు

అమనగల్లు, జూన్ 9(విజయక్రాంతి): తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీలో లోకకళ్యాణం కోసం మంగళవారం నిర్వహించిన చండీయాగంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం, నేడు ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమానికి సభ విజయవంతంపై నాయకులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో జరగబోయే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని భారీ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.