23-09-2025 08:47:59 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka Saralamma) దేవాలయంను సందర్శించనున్నారు. మేడారం జాతర(Medaram Jatara) ఏర్పాట్లను సీఎం నేరుగా పరిశీలించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మేడారం గద్దెలను సందర్శించనున్నారు. మేడారం పూజారులతో భేటీ కానున్నారు. మాస్టర్ ప్లాన్ పై సమీక్షించనున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మేడారం జాతర పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపద్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించారు.