calender_icon.png 23 September, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు

23-09-2025 09:38:55 AM

హైదరాబాద్: మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ(Maoist Central Committee ) చర్యలు తీసుకుంది. భూపతి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రిని పార్టీకి అప్పగించాలని హెచ్చిరించింది. ఆయుధ సామగ్రి అప్పగించకపోతే పీపుల్స్ గొరిల్లా ఆర్మీ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal alias Bhupathi) పై మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపణలు చేసింది. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై ప్రకటనను మావోయిస్టు కేంద్రకమిటీ ఖండించింది. భూపతి విడుదల చేసిన కరపత్రాలు, ఆడియో, వీడియోలను ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీకి భూపతి తమ్ముడు. ఇటీవల తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతకు(Sujatha) భూపతి మరిది.