calender_icon.png 23 September, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర

23-09-2025 09:57:20 AM

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కుట్ర చేస్తోందని కవిత ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నచోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్(Local body election schedule)కు ముందే ప్రభుత్వం కులగణన సర్వే వివరాలు వెల్లడించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి డిమాండ్ చేశారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్టే అన్నారు. గ్రామ పంచాయతీల వారీగా కుల గణన(Caste Census Survey) వివరాలు వెల్లడించాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పిన కవిత రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు పోరాటం కొనసాగుతోందని చెప్పారు.