3 September, 2026 | 6:45 PM

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు... ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న

07-06-2024 | 04:26pm
హైదరాబాద్ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాల ప్రక్రియ మూడో రోజు ఉత్కంఠ రేపుతుంది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకొనసాగుతుంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియల్లో ఇప్పటికే 42 మంది ఎలిమినేషన్ అయ్యారు. 42 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మధ్య పోటాపోటీగా  అవుతుందని అధికారులు వెల్లడించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో  తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు, రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు,  గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 19 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.