మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే మళ్లీ ఆర్థిక సాయం: సీఎం రేవంత్
మా ప్రాధాన్యత రైతులు, విద్యార్థులు
ఎస్ఐ ఫలితాల్లో నల్గొండ జిల్లా అభ్యర్థులే 50 శాతం
హైదరాబాద్: సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైయ్యారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులైతే మళ్లీ ఆర్థికసాయం చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమ ప్రాధాన్యత రైతులు, విద్యార్థులు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో పదేళ్లు కళ్లారా చూశామని సీఎం తెలిపారు. ఎస్ఐ ఫలితాల్లో నల్గొండ జిల్లా అభ్యర్థులే 50 శాతం ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాం రెడ్డి, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం, పలువురు అధికారులు పాల్గొన్నారు.






