02-12-2025 01:52:24 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కొత్తగూడెంలో పర్యటించనున్నారు. అనంతరం కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కొత్తగూడెంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరుతో నిర్మించిన ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ఆయన ప్రారంభిస్తారు. ఈ వర్సిటీ భూ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమివ్వనుంది.