17 March, 2026 | 11:52 PM

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు పట్టివేత

17-03-2026 10:19 PM

వేణుగోపాలస్వామి గుట్టను లూటీ చేస్తున్న అక్రమార్కులు

ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

వేములపల్లి,(విజయక్రాంతి): రోడ్డు నిర్మాణం పేరుతో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను పట్టుకున్నట్లు మంగళవారం తహసిల్దార్ హేమలత తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులో గల వేణుగోపాల స్వామి గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మూడు టిప్పర్ల ద్వారా మట్టిని రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదులు చేయడంతో దాడి చేసి టిప్పర్లను స్వాధీన పరుచుకున్నామన్నారు. ఈ మేరకు టిప్పర్లను వేములపల్లి పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఇదే విషయమై ఎస్సై వెంకటేశ్వర్లు వివరణ కోరగా తహసిల్దార్ టిప్పర్లను తమకు అప్పగించారని వాటిని మైనింగ్ అధికారులకు తాము అప్పగిస్తామని ఆయన తెలియజేశారు.