02-12-2025 10:21:56 AM
హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం లేని లోటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తీర్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొత్తగూడెంలో పర్యటించనున్నారు. భద్రాద్రి జిల్లాలో భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి పుష్కలంగా వనరులు ఉన్నాయి. సింగరేణి బొగ్గు, మూతబడిన రాగి గనులు సహా ఎన్నో వనరులున్నాయి. భూ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఈ వర్సిటీ ఊతమివ్వనుంది. వర్సిటీ స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుందని ప్రభుత్వం పేర్కొంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలిం చారు