రూపాదేవి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి
23-06-2024 01:04 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి గురువారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. ఎమ్మెల్యే సత్యాన్ని పరామర్శిం చారు. రూపాదేవి చిత్రపటానికి నివాళి అర్పించారు. సీఎం వెం ట ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, నేత వేం నరేందర్ ఉన్నారు.






