16 April, 2026 | 5:33 AM

సీఎం రేవంత్‌వి తుగ్లక్ నిర్ణయాలు

30-05-2025 12:59 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మే 29(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.  నిన్నమొన్నటి వరకు ఇదిగో ‘తెలంగాణ రైజింగ్’ అని ప్రచారం చేసి, తాజాగా ఆ నినాదాన్ని ‘తెలంగాణ రైజింగ్ 2047’గా మార్చారని దుయ్యబట్టారు. సీఎం రోజుకో కొత్త నినాదాన్ని ఎత్తుకుంటూ, ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నది పురోగతి కాదనీ, కేవలం తిరోగమనమేనని అభిప్రాయపడ్డారు. మోదీ వికసిత్ భారత్ 2047ను అనుకరిస్తూ, సీఎం కూడా అదేబాటలో పయనిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.