calender_icon.png 23 January, 2026 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విట్టీలీక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

03-10-2024 01:55:26 AM

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్ ఏ శేఖర్ రచించిన విట్టీలీక్స్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. తన జర్నలిజం కెరీర్‌లో ప్రముఖ వ్యక్తుల హాస్యపు సంఘటనలను ఈ పుస్తకంలో ఆయన పొందుపరిచారు.

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మొదలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్‌ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్, ఇప్పటి సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలకు సంబంధించి హాస్యకోణాన్ని ఈ పుస్తకంలో వివరించినట్లు వెల్లడించారు.

పత్రికల్లో అచ్చవ్వని విషయాలే ఇందులో ప్రధానంగా ఉంటాయన్నారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.