calender_icon.png 17 May, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాపుకు కడసారి వీడ్కోలు.. కన్నీటి నివాళులు

17-05-2025 03:25:49 PM

మధుసూదన్ రెడ్డి మృతదేహం సందర్శించిన సీఎం సతీమణి గీతారెడ్డి

మధుసూదన్ రెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు 

కొంపల్లి వీధుల గుండా అంతిమయాత్ర

మునుగోడు,(విజయక్రాంతి): వెదిరె పూలమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెగా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి శివాలయం కమిటీ చైర్మన్ విజేందర్ రెడ్డి తండ్రి వెదిరె మధుసూదన్ రెడ్డి (బాపు)అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి అత్యంత దగ్గర బంధువు అయినా మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్ధం మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని శనివారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ఆయన నివాసం వద్ద ఉంచారు. రాజకీయ, ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మధుసూదన్ మృతదేహ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గ్రామంలోని పురవీధుల గుండా డప్పు వాయిద్యాలు బాణాసంచాలతో ఘనంగా  అంతిమయాత్ర జరిగింది. మధుసూదన్ రెడ్డి గ్రామంలోనే ఆయన అంతకీయాలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. గ్రామంలోనే ఏకైక కుటుంబం బాపు,అమ్మ(మధుసూదన్,రెడ్డి పూలమ్మ) అనే ఆనవాయితీతో వచ్చిన ఆదర్శవంతమైన జీవితం మధుసూదన్ రెడ్డిది. ఆయన కడసారి చూపులో కన్నీటిపర్వంతో వీడ్కోలు పలికారు. ఇక బాబు లేడనే విషయం తో ప్రజలు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. తన కుమారులు పూలమ్మ ఫౌండేషన్ తో గ్రామంలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలను మన్నలను పొందుతున్నారు.

ఈ తరుణంలో మధుసూదన్ రెడ్డి మరణించడం దురదృష్టకరమని భావిస్తున్నారు. భౌతికంగా బాపు ప్రజల నుండి దూరమైన గ్రామ ప్రజ గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. ఈ అంతిమయాత్రలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్,ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారాబోయిన రవి ముదిరాజ్, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచులు ,ఎంపీటీసీలు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.