calender_icon.png 23 August, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం: సీఎం రేవంత్ రెడ్డి

17-05-2025 01:16:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం సాధించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి ఈరోజు తెలంగాణ పోలీస్ ప్రథమస్థానం సాధించడం గర్వగా ఉందని, ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్, ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని, వివిధ రంగాల్లో ప్రపంచానికే తెలంగాణ రూల్ మోడల్ గా ఉండాలన్నదే మా ప్రభుత్వం ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు.

దుబాయ్ లో ఇటీవల నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025లో హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ కు ఆరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్ సమ్మిట్ లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీనార్కోటిక్స్ విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకొని అవార్డు అందుకున్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.