22 March, 2026 | 7:33 AM

మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

18-09-2024 12:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశాన్ని పురోగతి, శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయనకు ఆరో గ్యం, మనో బలం ఇవ్వాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నా” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.