22 March, 2026 | 2:26 AM

ప్రైవేటు బిల్లు తెస్తాం

22-03-2026 12:58 AM
  1. ఆరు కాదు కదా అర గ్యారెంటీ కూడా అమలు కాలేదు 
  2. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును ఆమోదించాలి 
  3. దగా పడ్డ తెలంగాణ ప్రజల తరఫున ఈ బిల్లు 
  4. ప్రపంచ ఎన్నికల చరిత్రలో అతిపెద్ద ఫ్రాడ్ అభయహస్తం మేనిఫెస్టో 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి) : ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తున్నామని 840 రోజులు గడిచిపో యినా ఇప్పటివరకు ఆరు కాదు.. అర గ్యారెంటీ కూడా అమలుకు నోచుకోలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోనే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసంచేసిన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ ప్రైవేట్  మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే సీఎం ఆరు గ్యారెంటీల అమలు ఫైలు పైన సంతకం చేశార ని, సరిగ్గా వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్‌తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించారని గుర్తు చేశారు. అయినా ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీల అమలుకు అతీగతీ లేదని మండిపడ్డారు.

అందుకే ఈ సమావేశాల్లోనే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతామని, స్పీకర్ కార్యాలయాన్ని, మండలిలో చైర్మన్ కార్యాలయాన్ని కలిసి ఈ బిల్లును అనుమతించాలని కోరుతామని వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెం టనే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలని, గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తుచేశారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వాలు ఆమోదించే సంప్రదాయం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నదని, పాలక పక్షం ప్రతిపక్షం రెండు కోరుతున్నాయి కాబట్టి ఈ బిల్లు ఆమోదం ఈజీగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రైతులు మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు ఇలా ప్రతి ఒక్క వర్గం తరఫున ఈ బిల్లును మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. కూటి కోసం కోటి తిప్పలు పడతారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

సీఎం సంతకం పెట్టిన ఫైల్ ఎక్కడుంది..

ప్రజల నుంచి ఒక్క ఓటు రాబట్టడానికి ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వల వేసి ఓట్లు పట్టి, ఓట్లు కొల్లగొట్టి, గెలిచి, గ్యారెంటీల గారడీ చేసి, నాలుగు కోట్ల మందికి టోపీ పెట్టారని చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ తొలి ఫైల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేస్తూ ఫొటోలకు పోజు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకు ఆ గ్యారెంటీలు అమలు కాలేదన్నారు.

అందుకే మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లును తయారుచేశామని, దీనిని వచ్చే శుక్రవారం సభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 1986 లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారని, ఆనాటి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సీహెచ్ విద్యాసాగర్ రావు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెడితే, గవర్నమెంట్ దానిని ఆహ్వానించి, చట్టం కూడా చేసిందని గుర్తుచేశారు.

ప్రభుత్వానికి సంస్కారం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమిటి? మద్దతు ఇవ్వడానికి అని ప్రశ్నించారు. మీరు సంతకం పెట్టిన ఫైల్ ఇప్పటివరకు దొరకడం లేదని, ఆ ఫైల్ ఎక్కడుందని నిలదీశారు. దానిని తప్పకుండా వెతుకుతాం, పట్టుకుంటామని తెలిపారు. గ్యారెంటీలను అమలు చేసే బిల్లు ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌కు ఇబ్బందిగా ఉందని, అం దుకే మేము బిల్లు తయారుచేసుకొని వచ్చామని కేటీఆర్ తెలిపారు. 

బీజేపీ వ్యతిరేకించినా..

బిల్లుపై కాంగ్రెస్‌కు అభ్యంతరం ఉండడానికి అవకాశంలేదని, అటు అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కలిసిన తర్వాత, మేము బిల్లు పెట్టిన తర్వాత పాస్ కాకపోవడానికి సమస్య లేదన్నారు. అటు శాసనసభలో గానీ, ఇటు కౌన్సిల్‌లో గానీ బీజేపీ వ్యతిరేకించినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని పేర్కొ న్నారు. ‘ఒక ఫైల్‌పై సీఎం సంతకం పెడితే ఆ ఫైల్ దొరక్కుండా పోయే ఆస్కారం ఉంటుం దా? అని ప్రశ్నించారు.

ఫైల్‌పై సంతకం పెట్టి రెండున్నర ఏళ్లు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో దేశంలో ఎక్కడైనా ప్రభు త్వం ఉంటుందా.. కానీ మన రాష్ట్రంలో ఉందన్నారు. అందుకే మాకు అనుమానం వస్తుందన్నారు. ఎక్కువగా ఢిల్లీ పర్యటనకు వెళ్తుంటారు కదా.. రాను పోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నారా? లేదా ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేదా మొదటి సంతకమే మోసం తో మొదలైందా? అని ప్రశ్నించారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ముగిశాయని, 2028 లో జరిగే బడ్జెట్ ఎట్లాగూ ఎన్నికల బడ్జెట్ కాబట్టి దానికి అర్థం పర్థం ఏమి ఉండదన్నారు.

ఇక మిగిలింది 2027 బడ్జెట్ మాత్ర మే, అందుకే ఈ ఆరు గ్యారెంటీలు విషయంలో మేము పట్టుబడుతున్నామని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలన్నారు. మహిళలకు రూ. 2,500 కోసం, వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ కోసం, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా రూ. 15,000 కోసం, 22 లక్షల మంది కౌలు రైతులకు రూ. 15,000 కోసం, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు, ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం ఈ బిల్లు ప్రవేశపెట్టబో తున్నామని స్పష్టం చేశారు. 

దగాపడ్డ తెలంగాణ తరపున.. 

అసెంబ్లీలో జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షంగా ప్రైవేటు బిల్లు తీసుకురా వడం మా బాధ్యత అన్నారు. దారుణంగా దగా పడ్డ తెలంగాణ ప్రజల తరపున ఈ బిల్లును పెడుతున్నామని చెప్పారు. ఈ బిల్లు చట్టం అయితే ఆరు గ్యారెంటీలు విషయం లో ఎవ్వరికీ దరఖాస్తు పెట్టుకునే పని లేదు, దండాలు పెట్టే పని లేదన్నారు. ట్రాఫిక్ చలాన్ల విషయంపై ఇటీవల సీఎం చెప్పినట్టుగానే ఈ బిల్లు చట్టం అయితే ప్రజలకు ఖాతా ల్లో నగడు జమ అవుతుందన్నారు.

మీ ఖాతాల్లో వచ్చి పడతది లేదంటే బాకీగా మిగిలిపోతదని, మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుందని తెలిపారు. చట్టం అయితే హక్కు వస్తుందని, ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి, ’ఒక చట్టం ఉంది, వీళ్ళు ఇస్తలేరు’ అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టిస్తుందన్నారు. ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలిస్తుందో, చట్టం చేస్తే అట్లాగే మీకు రూ. 4,000 పెన్షన్, మహిళలకు రూ. 2,500, రైతులకు రూ. 15,000, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డ్ వస్తుందని చె ప్పారు.

ఈ బిల్లు చట్టం అయితే రైతన్నలకు రైతుబంధు ఎగగొట్టడానికి ప్రభుత్వానికి వీలుండదని, ఖచ్చితంగా రైతుబంధుతో స హా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయా ల్సి వస్తుందని చెప్పారు. ఆరు గ్యారంటీలు అమలుకు ఈ చట్టం అత్యంత కీలకమ ని, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే ప్ర భుత్వం మెడకు ఇది ఒక చట్రం లెక్క పనిచే స్తూ ప్రభుత్వ ఎగవేతలకు కళ్లెం వేస్తుందన్నా రు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఖచ్చితంగా లబ్ధి చేకూరేలా వీలవుతుందని కేటీఆర్ తెలిపారు. 

అన్ని పార్టీల మద్దతు కోరుతాం.. 

ఈ బిల్లును మేము ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతామని, అవసరమైతే లేఖలు రాస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ బిల్లు అమలు కోసం స్థానిక ఎమ్మెల్యేల పైన ఒత్తిడి చేయాలని, అప్పుడే వారికి ఆరు గ్యారంటీల లబ్ధి కలుగుతుందని పిలుపునిచ్చారు. శాసనసభ స్పీక ర్‌ను, కౌన్సిల్ చైర్మన్‌ను కూడా ఈ అంశానికి సంబంధించి విజ్ఞప్తి చేస్తామని, ఈ బిల్లుకు సంబంధించి కూడా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని స్ప ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ బిల్లును అసెం బ్లీలో అనుమతించి చట్టంగా మార్చాలని డి మాండ్ చేశారు. ఒకవేళ ఈ బిల్లును కాంగ్రె స్ పార్టీ శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా ఉపయోగించుకుంటామని, ప్రజల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.

రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ నేతలంతా స్వయంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఈ హామీని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా ఒత్తిడిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టంచేశారు. హామీలన్నీ అమలు చేశానని చెప్తున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో ఎక్కడైనా సెక్యూరిటీ, పోలీసు బల గా లు లేకుండా ప్రజలతో చర్చకు రావాలని సవాల్‌విసిరారు.

రాహుల్‌గాంధీ వెళ్లిన అశో క్‌నగర్ వస్తారా? రాష్ట్రంలోని ఇతర ప్రాంతానికి వస్తారా? అనేది ఆయనే నిర్ణయిం చుకోవాలని సూచించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీసి మాకు కావాల్సిన లబ్ధిని దక్కించుకునే హక్కు ప్రజలకు కలుగుతుందని అన్నారు.