22 March, 2026 | 2:59 AM

మీ సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తా

22-03-2026 01:29 AM
  1. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  2. మల్లన్నను కలిసిన చిన్న చిన్న కటింగ్ షాపుల యాజమాన్యాలు,
  3. నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు

హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): కార్పొరేట్ సెలూన్ సెంటర్ల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న కటింగ్ షాపుల యాజమాన్యాలు, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు కలి సి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు అరుదుగా ఉండే కార్పొ రేట్ సెలూన్లు ఇప్పుడు ప్రతి ప్రాంతంలో, జనసంచారం తక్కువగా ఉన్న చిన్న చిన్న గల్లీలో కూడా ఏర్పాటవుతున్నాయని, దీని వల్ల తమ వంటి చిన్న వ్యాపారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఇలాంటి సమస్యలు పెద్దగా లేకపోయినా, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు.తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతో, తీన్మార్ మల్లన్నని ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.

తమకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ముందుకు రావాలని కోరారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న  స్పందిస్తూ చిన్న చిన్న వృత్తిదారుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని, వారి సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చా రు. ప్రభుత్వం చిన్న వ్యాపారులను పట్టించుకోకపోవడం సరికాదని, వారి హక్కుల కోసం తాము పోరాడతామని తెలిపారు.

టీఆర్పీలోకి పలు పార్టీల వారు చేరిక

బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న బీసీ ఉద్య మ నాయకుడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు హైదరాబాద్ ఉమ్మడి జిల్లా ఆర్ భావన వెంకటేష్  సూచన మేరకు హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ బీ కిషోర్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ ఆర్ సందీప్  ఆధ్వర్యంలో వివిధ పార్టీ లకు చెందిన వారు ఆయా పార్టీలని వీడి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు..

వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వా ములు కావాలని పిలుపు నిచ్చారు. నాయకులు,కార్యకర్తలు నిబద్దత, అంకిత భావంతో పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

25న మరుగుజ్జు వర్గాల నిరసన

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఈ నెల 25న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న మరుగుజ్జు వర్గాల నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరుతూ మరుగుజ్జు సంఘం నాయకులు శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో మరుగుజ్జు వర్గాలకు ఇచ్చిన హామీ లను విస్మరించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

హామీల అమలు కోసం ఈ నెల 25న నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, దీనికి మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం మల్లన్న మాట్లాడుతూ, మరుగుజ్జు వర్గాల న్యాయమైన డిమాండ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సంఘం నాయకుల ఆహ్వానం మేరకు 25న పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.మరుగుజ్జు వర్గాల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి సమాజం మొత్తం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఘనంగా రంజాన్ వేడుకలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున హాజరై పార్టీ అధినేత మల్లన్నని కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యాలయం పండుగ వాతావరణంతో కళకళలాడింది.అనంతరం మల్లన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరి సోదరమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సోదరులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, వాటా కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు.ఎవరెంతో వారికంతా అనే నినాదంతో సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మైనార్టీ వర్గాల అభివృద్ధి, హక్కుల సాధన కోసం పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఐక్యతను చాటుతూ రంజాన్ పండుగ శుభాకాంక్షలను పరస్పరం పంచుకున్నారు.