చిన్నకోడూరు విద్యార్థులతో సీఎం!
10న విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
ఉత్తమ ఫలితాలతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు
టెన్త్‌లో 10మందికి 10 జీపీఏతో ప్రతిభ
25మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి
సర్కారీ స్కూళ్లకే ఆదర్శంగా చిన్నకోడూరు జెడ్పీ హైస్కూల్
సిద్దిపేటరూరల్, జూన్ 7 (విజయక్రాంతి): 2023-24 విద్యాసంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉమ్మడి మెదక్‌జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పరీక్ష రాసిన మొత్తం 56 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం సర్కారు స్కూళ్ల చరిత్రలో ఇదే ప్రథమం. వీరిలో పది మంది 10 జీపీఏతో అదరగొట్టారు. పదకొండు మంది 9.8 జీపీఏతో సత్తా చాటారు.
మిగతా 35మంది 7.3 9.7 మధ్య గ్రేడింగ్ సాధించారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 980 ప్రభుత్వ పాఠశాలలకు 227 జడ్పీహెచ్‌ఎస్, 113 యూపిఎస్‌లు, 638 ప్రాథమిక పాఠశాలలు, 22 కేజిబివి, 14టీఎస్‌ఎంఎస్‌లు, 32 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్సియల్ స్కూళ్లు ఉన్నాయి. మరో 78 జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్ళు ప్రస్తుతం మూతపడి ఉన్నాయి. 227 జడ్పీహెచ్‌ఎస్‌లలో కేవలం 65మంది విద్యార్థులు మాత్రమే 10జిపిఎ సాధించగా పదిమంది చిన్నకోడూరు జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన వారు కావడం గమనా ర్హం.
25 మంది విద్యార్థులు బాసర ఐఐటీకి ఎంపిక కావటం గర్వకారణం. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల పిల్లలను సత్కరించాలని వందేమాత రం ఫౌండేషన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 10న సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఈ కార్య్రకమంలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రోగ్రాంకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉందని తెలిసింది.
రాష్త్రంలో నంబర్‌వన్ స్కూల్‌గా గుర్తింపు రావటం సంతోషంగా ఉంది
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ విద్యావ్యవస్థలో చిన్నకోడూరు జడ్పీహెచ్‌ఎస్ నెంబర్‌వన్ స్థానంలో ఉండటం ప్రధానోపాధ్యాయునిగా నాకు చాలా సంతోషం గా ఉంది. నాతోటి ఉపాధ్యాయ బృందం కృషి అభినందనీయం. ప్రతి ఒక్క టీచర్ తమ వంతు కర్తవ్యంగా మా పిల్లలు అనే భావనతో వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతితో 10 జిపిఎ సాధించిన వారికి వందేమాతరం ఫౌండేషన్ వారు ఈనెల 9న హైదరాబాదులోని ప్రాముఖ్యమైన ప్రదేశాలను విద్యార్థులకు చూపించటం జరుగుతుంది.
10న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించే కార్యక్రమం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవనంలో ఏర్పాటుచేశారు. అందుకు 10జిపిఎ సాధించిన విద్యార్థులు 8న సాయంత్రం వెళ్ళనున్నారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులను వందేమాతరం ఫౌండేషన్‌వారు కల్పించనున్నారు.
పి.లక్ష్మయ్య, ప్రధానోపాధ్యాయుడు (జడ్పీహెచ్‌ఎస్






