30 June, 2026 | 1:46 AM

ప్రజావాణిలో ప్రజాసమస్యలపై సీఎంసీ కమిషనర్ సమీక్ష

30-06-2026 12:00 AM

శేరిలింగంపల్లి, జూన్ 29 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన సోమవారం ప్రజ సమస్యల పరిష్కారం కోసం ’ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రజల నుంచి అందిన వినతులను సమీక్షించి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి.

వీటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 31,ఇంజనీరింగ్ విభాగానికి11,స్పోరట్స్ విభాగానికి 1 వినతి ఉన్నట్లు అధికారులు తెలిపారు.ప్రతి వినతికి యూనిక్ ఐడీ,ట్రాకింగ్ లింక్ కేటాయించినట్లు కమిషనర్ శ్రీజన తెలిపారు. దీంతో ప్రజలు తమ అర్జీల పురోగతిని సులభంగా ట్రాక్ చేయవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ శ్రీజన మాట్లాడుతూ..ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి.ప్రతి ఫిర్యాదుపై అధికారులు పారదర్శకంగా వ్యవహరించి, పౌరులకు సమస్య పరిష్కార స్థితిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ ’ప్రజావాణి’ కార్యక్రమం ద్వారా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని అర్జిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.