ఆఫ్గనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు
- 36 మంది టీటీపీ ఉగ్రవాదులు మృతి
- మృతుల్లో కొందరు చిన్నారులు, మహిళలు
- పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్
ఇస్లామాబాద్/ కాబూల్, జూన్ ౨౯: ఆఫ్గనిస్తాన్ సరిహద్దు పక్తియా, పక్తికా, మాండో ఖైల్, కునార్‌లోని తెహ్రిక్- ఎ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద స్థావరాలపై సో మవారం పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ దాడులను పాక్ సమా చార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ ధ్రువీకరించారు. ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యం గా చేసుకుని దాడులు నిర్వహించి, 36 మం ది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు స్పష్టం చేశారు.
తమ దేశంలో హింసాత్మక ఘటనలకు టీటీపీ, దాని అనుబంధ ఉగ్రవాద గ్రూ పులే కారణమని ఆరోపించారు. ఇదే కోవలో శనివారం కరాచీ పారామిలిటరీ రేంజర్స్ కార్యాలయంపైనా దాడి జరిగిందని తెలిపారు. దాడికి పాకిస్థాన్ తాలిబాన్ స్ప్రింటర్ గ్రూప్ జమాత్- ఉల్- అహ్రార్ బాధ్యత వహించిందని ఆరోపించారు.. జమాత్- ఉల్- అహ్రా ర్ సంస్థ కూడా తమకు చెందిన ‘ఖులాఫా-ఎ-రాషిదీన్ ఇష్తిషాదీ బ్రిగేడ్’ గ్రూప్ ఆత్మా హుతి దాడికి పాల్పడినట్లు తెలిపారు.
మరోవైపు, అఫ్గన్ తరఫున తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ హమ్దుల్లా ఫిత్రత్ మాట్లాడుతూ.. పాక్ వైమానిక దాడుల్లో ౩౬ మంది అఫ్గన్ పౌరులు దుర్మరణం పాలయ్యారని, ౧౬౦ మందికి పైగా చెప్పడం గమనార్హం. తాము ఉగ్రవాదులను మట్టుపెట్టామని పాక్ చెబుతుండగా, తాలిబన్ ప్రభుత్వ పెద్దలు మాత్రం అందుకు భిన్నవాదనను తెరపైకి తీసుకొచ్చారు.






