సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
30-06-2026 12:00 AM
తాడ్వాయి, జూన్ 29 (విజయక్రాంతి): విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్‌బిఎస్‌కె ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతిఒక్క విద్యార్థికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పల్సా హరీష్ గౌడ్, గౌతమి, ఏ ఎన్ ఎం నీరజ, ఫార్మాసిస్ట్ స్వప్న, ఎంఈఓ రామస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






