28 July, 2026 | 12:55 AM

సైబరాబాద్‌ను శుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం కోరిన సీఎంసీ

28-07-2026 12:00 AM

అక్రమ చెత్త పారవేస్తే ఫొటో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేయాలని సూచన  

శేరిలింగంపల్లి, జూలై 27 (విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల పాత్ర కీలకమని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) స్పష్టం చేసింది. అక్రమంగా చెత్త పారబోస్తున్న చోట్లను గుర్తించిన వెంటనే ఫొటోలు తీసి సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పంపాలని అధికారులు కోరారు.పోస్టు చేసేటప్పుడు @CMC_Offcl హ్యాండిల్ను తప్పనిసరిగా ట్యాగ్ చేయాలని, అలాగే ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రాంత వివరాలు కూడా పేర్కొనాలని సీఎంసీ సూచించింది.

ప్రజలు అందించే ఫొటోలు, సమాచారం ఆధారంగా సంబంధిత బృందాలు వెంటనే స్పందించి చెత్తను తొలగించడంతో పాటు అవసరమైన చర్యలు చేపడతాయని తెలిపింది.మీరు ఫొటో పంపండి& చర్యలు మేము తీసుకుంటాంఅనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎంసీ, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన సైబరాబాద్ నిర్మాణం ప్రజల భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి పౌరుడూ ఈ చొరవలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.