14-01-2026 02:14:18 AM
చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు
గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్
మేడ్చల్ అర్బన్ జనవరి 13 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ సమీపంలో గల సుతారిగూడ,మేడ్చల్ పెద్ద చెరువులలో సీఎంఆర్ కళాశాలకు చెందిన మురుగు నీరు కలిసి చెరువులు విషతుల్యం అవుతున్నాయని మేడ్చల్ డిప్యూటీ కమిషనర్ సుదాంష్ కు గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంగిస్తూ సుతారిగూడ సమీపంలోని సీఎంఆర్ కళాశాల యాజమాన్యం తమ విద్యాసంస్థల నుండి వెలువడే మురుగు నూటిని ఎటువంటి శుద్ధి చేయకుండా నేరుగా సుతారిగూడ చెరువులోకి వదులుతున్నారని అన్నారు.
సుతారిగూడ చెరువు నిండి ఆ కలుషిత నీరు బయటకు వచ్చి మేడ్చల్ పెద్ద చెరువు ప్రాంతానికి జీవనాధారమైన పెద్ద చెరువులో మురుగునీరు కలుస్తుందని దీనివల్ల రెండు ప్రధాన జల వనరులు పూర్తిగా విషతుల్యంగా మారుతున్నాయని పేర్కొన్నారు. మురుగు నీటిని విడుదల చేస్తున్న సీఎంఆర్ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ లు కందాడి నరేందర్ రెడ్డి, గరిసెల సురేందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి.సిహెచ్ రమేష్, మాజీ కౌన్సిలర్ చాపరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రాజు, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, నారెడ్డి రవీందర్ రెడ్డి, దాత్రిక లింగం, పానుగంటి మహేష్, టైలర్ రాజు, రంజిత్, రాజేందర్ ముదిరాజ్, భానుచందర్, తదితరులు పాల్గొన్నారు.