14-01-2026 02:12:51 AM
ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్
ఉప్పల్, జనవరి 12 (విజయక్రాంతి) : ఫోన్ యాప్ వచ్చే అపరిచిత యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ అన్నారు. మల్లాపూర్ డివిజన్లోని చాణిక్యపురి కాలనీ అసోసియేషన్ శ్రీ దుర్గా మల్లేశ్వరి పోచమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహిస్తూ, ఏదైనా అనుమానం వస్తే 100 సమాచార ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం ముగ్గుల పోటీ విజేత మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ బిఆర్‌ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, నాచారం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మైబల్లి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కప్పర సాయి మల్లాపూర్ బిజెపి నాయకులు శైలేష్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ గంధమల రాములు కృష్ణ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు దశరథ్ ఉపాధ్యక్షులు కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.