calender_icon.png 13 September, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ ధాన్యాన్ని త్వరగా ఇవ్వాలి

13-09-2025 01:05:13 AM

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ 

వనపర్తి, సెప్టెంబర్ 12 ( విజయక్రాంతి ) : మిల్లుల ద్వారా ఎఫ్.సి.ఐ కు ఇవ్వాల్సిన సిఎంఆర్ ధాన్యాన్ని త్వరగా ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం మదనపూర్ మండలంలోని వాసవి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ఉన్న ప్రస్తుత నిల్వ ఉన్న ధాన్యం స్టాకులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్ర భుత్వం ద్వారా మిల్లుకు కేటాయించిన ధాన్యం, ఇప్పటి వరకు అప్పగించిన ధాన్యం, మిగిలి ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలించారు. 

నిల్వలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి, ధాన్యం ని ల్వల లభ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, ప్రభుత్వ మా ర్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు.జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ) కాశీ విశ్వనాథ్, మిల్లరు తదితరూ అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.