calender_icon.png 13 September, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి: రైతు సంఘం

13-09-2025 01:04:19 AM

 ఎర్రుపాలెం సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఎర్రుపాలెం మండల అయ్యవారిగూడెం సొసైటీ ముందు రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా దివ్వెల వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకి యూరియా సరఫరా చేయకుండా గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి యూరియా సకాలంలో దిగుమతి చేసుకోకపోవడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తో పాటు వర్షాలు ఉన్న పరిశ్రమను ఉత్పత్తి నిలిపివేయడంతో యూరియా కొరత ఏర్పడిందని రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందించాలని కోరారు.

పట్టాదారు పాస్ పుస్తకాలు లేవనే పేరుతో రైతులకు యూరియా సరఫరా చేయటం లేదని ప్రభుత్వ రికార్డులలో నమోదు కాని రైతులకు ఆధార్ కార్డు ఆధారంగా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.తదితరులు రైతు సంఘం నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు నల్లబోతు హనుమంతరావు దివ్వెల వీరాంజనేయులు పాల్గొన్నారు.