13-09-2025 01:05:30 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 12,(విజయక్రాంతి):ములకలపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఎస్టి, ఎస్సీ, వెనుకబడిన తరగతుల వసతి గృహాలను ములకలపల్లి మండల ఎన్ ఎస్ యు ఐ, యువజన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం ఆరపదార్ధాలు అందుతున్నాయా లేవా సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే వాటి విషయాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని గదులను, మరుగుదొడ్లను పరిశీలించారు.
హాస్టల్ వార్డెన్ లతో మాట్లాడుతూ మాట్లాడు తూ విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని వసతి గృహాల్లో ఎటువంటి అవసరాలు ఉ న్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. అకాల వర్షాలతో విష జ్వ రాలు ప్రబలే అవకాశం ఉన్నందున విద్యార్థులకు వైద్య చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని,పరిసరాల పరిశుభ్రత పాటించాలని వారు వార్డెన్లను కోరారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు గుంటూరు సాయిరాం, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్, ములకలపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు ముదిగొండ శివ, నరిమేకల నాగచైతన్య,సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దుగ్గి సంపత్ కుమార్ పాల్గొన్నారు.