calender_icon.png 14 May, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ రైస్‌ను వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలి

14-03-2025 12:53:15 AM

 వికారాబాద్, మార్చి- 13 ఖరీఫ్ 2024-25 కు సంబంధించిన సీఎంఆర్  దాన్య మును వెంటనే ప్రభుత్వంకు చెల్లించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ రైస్ మిల్లర్లను  ఆదేశించారు. రైస్ మిల్లర్,  పౌరసరఫరాల అధికారులతో ఆయన గురు వారం  తన చాంబర్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  సీఎంఆర్  డెలివరి చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ధాన్యంను పక్కదారి పట్టించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ 2024-25 సీజన్ లో పాల్గొన్న మిల్లర్స్ అందరు వరిధాన్యంనకు తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందిగా, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని వారికి తదుపరి సీజన్ లో వరిధాన్యం అలాట్ మెంట్ చేయరని తెలిపారు.

ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, డి.ఎం. వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా,  ఎన్ఫోర్స్మెంట్  అధికారులు తదితరులు పాల్గొన్నారు .