calender_icon.png 23 August, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

14-03-2025 12:51:59 AM

  1. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్ 
  2. సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రావణ్

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా లోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటన జారీ చేశారు. ఈ క్రమం లోనే ఎమ్మెల్సీ అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పెద్దల సభకు ఎన్నికవగా బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు.

ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది నామినేష న్లు దాఖలు చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను సరిగా దాఖ లు చేయని కారణంగా అవి తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రధా న పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా కాంగ్రెస్ నాలుగు స్థానా లు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక సీటు కేటాయించింది. ఫలితం గా కాంగ్రెస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రావణ్ నామినేషన్ దాఖ లు చేసి కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.