17-07-2025 12:35:59 AM
సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, జూలై 16 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి సహాయనిధి నగదను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయం లో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 148 మంది పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని దానిలో భాగంగానే ఈ పథకం ద్వారా నగదు సాయంను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు గోపగాని వెంకటనారాయణ, పేరుమాళ్ల అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వై వెంకటేశ్వర్లు, జీడీ భిక్షం, నెమ్మది బిక్షం, పుట్ట కిషోర్, జీవన్ రెడ్డి, మొరిశెట్టి శ్రీను, బాషా, యుగేందర్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, నర్సింహా రావు, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.