calender_icon.png 17 July, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు ఇసుక, మొరం అనుమతి

17-07-2025 12:35:32 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్

కామారెడ్డి, జూలై 16 (విజయ క్రాంతి):  ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి  లబ్ధిదారులకు ఇసుక అవసరం పడినప్పుడు పంచాయతీ సెక్రెటరీ కీ దరఖాస్తు సమర్పించిన లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.  కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్   సబ్ కలెక్టర్, ఆర్డీఓ లు, తాసిల్దార్స్, ఎంపీడీవోస్ తో బుధవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇసుక రవాణా గురించి ఎంపీడీవోలకు, పంచాయతీ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇవ్వబడు తుందని ,రవాణా ఏర్పాటు లబ్ధిదారులే చేసుకోవాలి  అని అన్నారు. అంతేకాక ఇసుక లభ్యత లేనట్లయితే పక్క మండలo నుంచి ఇసుకను పొందవచ్చు అని పేర్కొన్నారు.

అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు మొరం అవసరమైన వారు పంచాయతీ కార్యదర్శి సిఫారసుతో ట్రాక్టర్కు 300 చొప్పున, టిప్పర్ కు 1200 చొప్పున, డిడి రూపంలో చెల్లించి మొరం అనుమతి పొందవచ్చు అని అన్నారు.తదుపరి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారిని స్ధానిక అవసరాల నిమిత్తం  ఇసుక  కొరకు 5 ప్రదేశాలలో కిష్టాపూర్, హాసుగుల్, కుర్ల,ఖతగావ్, శెట్లూర్ లకు పర్యావరణ అనుమతులకు తగు చర్యలకు  వేగవంతం చేయాలని  ఆదేశించారు.

ఇట్టి ఇసుక రవాణాపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆర్డీవోలు, ఏడి మైన్స్ కు ఆదేశాలు ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో  రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ బాన్స్ వాడ కిరణ్మయి,  పి.డి హౌసింగ్ విజయ పాల్ రెడ్డి ,తదితరులు, అధికారులు పాల్గొన్నారు.