12 August, 2026 | 2:08 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

12-08-2026 12:51 AM

పినపాక ఆగస్టు 11, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన గండెం లక్ష్మి అనే మహిళకు ప్రభుత్వం నుంచి  ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) 60, 000/- విలువ గల చెక్కును మంగళవారం అందజేశారు.

పినపాక శాసనసభ్యుల పాయం వెంకటే శ్వర్లు ఆదేశాల మేరకు, పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పేరం వెంకటేశ్వర రావు సూచనలతో జానంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం ఉమామహే శ్వరి, ఉప సర్పంచ్ దాట్ల రాజేష్ చేతుల మీదుగా ఈ చెక్కును బాధితురాలికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూనెం ఉమామహేశ్వరి, కాంగ్రెస్ నాయకులు మా ట్లాడుతూ... ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, నాయ కత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  కిషోర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.