calender_icon.png 22 January, 2026 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ ఫండ్

21-10-2024 04:29:26 PM

కొండపాక (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ ఫండ్ నిరుపేదలకు అండగా, ఎంతో సహాయపడుతుందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి బాలచంద్రన్ గౌడ్ అన్నారు. కొండపాక మండల కేంద్రానికి చెందిన, నల్ల రచన 13,500 రూపాయలు, ఎలిసాల కనకవ్వ 13500 రూపాయలు, ఎం.లలిత కి 12,500  రూపాయలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను  మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో మంజూరయ్యాయని, వాటిని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి బాలచంద్రం గౌడ్ సోమవారం రోజున చెక్కులను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తిప్పారం హరీష్ కుమార్, చిన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.