సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
ఘట్ కేసర్, మే 27 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్ కు చెందిన కె. వాణి అనారోగ్యంతో వైద్య చికిత్సల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా రూ. 60 వేలు మంజూరు అయ్యాయి.
అట్టి చెక్కును ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా బుధవారం లబ్ధిదారుకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ఘట్ కేసర్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ డొంకెని బిక్షపతి గౌడ్, యువ నాయకులు పల్లె విజయ్ గౌడ్, పాల్గొన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ సహాయం
మేడ్చల్ అర్బన్, మే 27 (విజయక్రాంతి): బాధితునికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మేడ్చల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా అందజే శారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని మేడ్చల్ శాసన సభ్యులు మల్లారెడ్డి అన్నారు.బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధికి చెందిన వాకిటి సాయికుమార్ కు మంజూరైన రూ 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితునికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు.మేడ్చల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా తన వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సహాయం పొందిన లబ్ధిదారుడు వాకిటి సాయికుమార్ మాట్లాడుతూ తమకు కష్ట కాలంలో ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ బి భాస్కర్ యాదవ్.మాజీ కో ఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






