6 June, 2026 | 2:46 AM

అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

06-06-2026 01:24 AM

వరంగల్, జూన్ 5 (విజయక్రాంతి): అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో జరిగింది. కుటుంబీకుల కథనం ప్రకారం కాశిబుగ్గ పద్మానగర్ కాలనీకి చెందిన రామారావు సంగెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూన్నారు.గురువారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రామారావు అలసటగా ఉందని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం వరకు  బయటికి రాకపోవడంతో కుటుంబీకులు తలుపులు తెరిచి చూడగా అచేతన స్థితిలో పడివున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.