calender_icon.png 22 June, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ఆదేశాలతో ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ & కళ్యాణ లక్ష్మి చెక్కులు

21-06-2025 08:22:25 PM

లబ్ధిదారులకు చెక్కుల అందజేతలో మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఆకుల చంద్రశేఖర్..

మంథని (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఆకుల చంద్రశేఖర్ శనివారం అందజేశారు. పాలకుర్తి మండలంలో 08 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కమాన్ పూర్ మండలంలోని 45 కళ్యాణ లక్ష్మి, 32 సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల చేతికి అందజేశారు. 

రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) చోరతో కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలోని కన్నాల, రాణాపూర్, బామ్లా నాయక్ తండా, జీడినగర్, కమాన్ పూర్ మండలంలోని నాగారం(లింగాల), శాలపల్లి, పెంచికల్ పేట, రొంపికుంట, జూలపల్లి, గొల్లపల్లి, గుండారం, కమాన్ పూర్, కిష్టం పల్లి, పేరపల్లి ఇతర గ్రామాలకు  చెందిన చెక్కులను వారి గ్రామంలో వారి వద్దకే వెళ్లి ఆకుల చంద్ర శేఖర్ నేరుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. దీంతో లబ్దిదారులు మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు.