calender_icon.png 22 June, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ లో యోగా వేడుకలు

21-06-2025 08:17:54 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ పాఠశాలలో శనివారం యోగా దినోత్సవ(International Yoga Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న మాట్లాడుతూ... ప్రతిరోజు విద్యార్థులు యోగాకు సమయం కేటాయించాలని, యోగ చేయడం వలన క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. అనంతరం యోగా గురువు విజయ్ కుమార్ విద్యార్థులకు యోగాసనాలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీ సుదీప్, అధ్యాపకు బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.