calender_icon.png 18 September, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ పథకం

18-09-2025 07:40:14 PM

మందమర్రి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీటీసీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు దుర్గం కుమారస్వామి కోరారు. మండలంలోని మామిడిగట్టు గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ రూ.52 వేల చెక్కును గురువారం ఆయన అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కొరకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందన్నారు. ప్రమాదాల బారిన పడి వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలను సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకుంటున్నారన్నారు. ఈ  కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు గాజుల సతీష్ గౌడ్, గ్రామస్తులు  పాల్గొన్నారు.