18-09-2025 07:38:40 PM
కుభీర్: కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామానికి చెందిన మాహుర్ శీను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుభీర్ నుండి పార్డి కె వెళ్లే రహదారిలో హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి తుమ్మ చెట్టుకు ఢీకొన్నాడు. దీంతో అయన అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. సమాచారం అందుకున్న భైంసా రూరల్ సీఐ నైలు నాయక్, కుభీర్ ఎస్ఐ కృష్ణ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృత్తుడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.