12-11-2025 12:00:00 AM
టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, నవంబర్ 11 : క్రీడలతో ఆరోగ్యం సాధ్యమవుతుందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిర్మల జగ్గారెడ్డి హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళాలన్నారు.
క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యార్థులు ఫోన్ కు దూరంగా ఉండడం వల్ల చదువుపై శ్రద్ద పెరుగుతుందని, విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షుడు బంగారు కృష్ణ, తోపాజి అనంత కిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, చింతల సాయికుమార్, భాను ప్రసాద్, మల్లేష్ తదితరులుపాల్గొన్నారు.