calender_icon.png 2 October, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే ఆయుధ పూజకు సిద్దమైన పూర్వపు ఆయుధాలు

02-10-2025 12:30:02 AM

మోర్తాడ్, అక్టోబర్ 1: పూర్వం అల్లకొండ(బాల్కొండ) అల్లయ్య,కొండయ్య (1059) సామ్రాజ్యం లో శ్రీ సోమ క్షత్రియులు యుద్దాల్లో వాడిన ఆయుధాలు బుధవారం రోజు ఆయుధ పూజకు సిద్దమైనాయని  శ్రీ సోమ క్షత్రియు(నఖాష్) బ్రమ్మ రౌతు నర్సింగ్ రావు తెలిపారు. మా పూర్వికులైన కీ, శే,బి. పెద్ద నర్సిగo, బి.నడిపి నరసింహులు, బి. లింబన్నల, బి. దేవన్న, కుటుం బాల పూర్వం యుద్దాల్లో ఉప యోగించిన ఆయుధాలైన కత్తి, డాలు, బరిసే, ఇతర 964 రకాల ఆయుధాలు (1059-2025) సంవత్సరాల నుండి (09) తరాలకు చెందిన శ్రీ సోమ క్షత్రియులమైన వారైన మేము ఆనాటి నుండి నేటికీ మా అయిదాలను ప్రత్యేక తెల్లని గుడ్డతో పూజ గదిలో భద్రపరుస్తూ ఉన్నామని ఆయన తెలిపారు.

దీనితోపాటు తమ ఆరాధ్య కులదైవమైన శ్రీ నిమిషాంబ దేవి పటాన్ని కీ, శే, బి. చౌదరి దేవన్న, బి.నర్సింలు పూర్వం బంగారు పూతతో తయారుచేసినదాన్నే నేడు ఓ ప్రత్యేకమైన పేట్టలో భద్రపరుస్తూ ఉన్నామని ఈ పటంతో పాటు ఆయుధాలను ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో ‘మానాయి రోజు ‘ మా వంశంలో ప్రతి సంవత్సరo నూతనంగా ‘ ప్ళ్ళున ‘ నవ దంపతులు ‘మనాయి రోజు‘ మడి కట్టుకొని మా అయిదాల పెట్టెను అమ్మ వారి పటాన్ని బయటకు తీసి గంధం,పసుపు, కుంకుమ తో అలంకరించి అలంకరిస్తారని తెలిపారు.

అనంతరం పూజ కార్యక్రమానికి సిద్ధంగా ఉంచు తామని సూర్యాస్తమo కాగానే అయిదాలు అమ్మ వారి పటాన్ని అలంకరించి ‘ రక్త తర్పణ కార్యక్రమం‘ జరిపిన తర్వాత మా వంశంలోని అందరు దసరా పండుగకు కొనుగోలు చేసుకున్న నూతన వస్త్రములు ఈ ఆయుధ పూజా వద్ద ప్రత్యేకమైన స్థలములో ఉంచూ తామని, అనంతరం నైవేద్యం సిద్ధం చేసి ఉంచగా గ్రామ పురోహితులు గణేష్ జోషి ‘ప్రత్యేకమైన  మంత్రోచ్చారా ణాలతో ‘ ఆయుధ పూజతోపాటు అమ్మవారి పూజలు నిర్వహిస్తా ఇస్తామని ప్రతి ఏడు ఇలాగే నిష్ఠతో జరుపుకుంటామని ఆయన తెలిపారు.

ఆయుధ పూజా అనంతరం పూజలో ఉంచిన ప్రసాదాన్ని సామూహికంగా అందరూ స్వీకరిస్తారు. అనంతరం రాత్రి 12 తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతారు.ఇది ఒక ఘట్టం కాగా రెండవ ఘట్టంలో దసరా రోజు ఆయుధ పూజా గదిలో ఉంచిన నూతన వస్త్రములు ధరించి అందరూ జమ్మి చెట్టు వద్దకు చేరుకుని పూజలు చేసిన అనంతరం రాత్రి భోజనాల అనంతరం దసరా రోజు అర్ధరాత్రి అందరూ ఆయుద పూజ మందిరం వద్దకు చేరుకొని ఆయుధాలను శుభ్రం చేసి యధావిధిగా ప్రత్యేకమైన గుడ్డతోపాటు తెల్లని వస్త్రం తో పాటు పెట్టాలో అమ్మవారి ఫోటోలు యధావిధిగా పెట్టలో భద్ర పరచడంతో ఇలా ఆయుధ పూజ ముగుస్తుంది.

ఇది మా పూర్వ అల్లకొండ శ్రీ సోమక్షత్రియ ‘నాఖాష్‘ వారి ఘనత.ఇలా ప్రతి సంవత్సరము మానాయి రోజు ఆయు ధ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుం ది. పూర్వం ఒక పురాతమైన పెంకుటిల్లు ఉండేది అందులో ఇప్పుడున్న ఆయుధాలే కాకుండా ఇంకో ఎక్కువ సంఖ్య లో ఆయుధాలు ఉండేది పెంకు టిల్లు కూలిపోయిన సమయంలో మట్టిలో కొన్ని ఆయుధాలు తుప్పు పట్టి భూగర్భంలోనే ఉండిపోయా యి ప్రస్తుతం ఉన్న ఆయుధాలు మాత్రమే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని శ్రీ నర్సింగ్ రావు వివరించారు.

 గజ్జల సప్పుడు 

మా ఆయుధాలు భద్రపరిచిన పూజా మందిరంలో ప్రతిరోజు అర్ధ రాత్రులు ‘గజ్జల చప్పుడు‘ వినిపిస్తూ ఉంటుంది ఇలాంటి శబ్దాలు కేవలము ‘తల్లి గర్భం నుండి ఎవరైనా ఎదురుకాళ్ళతో‘ పుట్టిన వారికి మాత్రమే ఈ గజ్జల చప్పుడు వినిపిస్తుందని నర్సింగ్ రావు వివరించారు.