బొగ్గు ఉత్పత్తి పెంచుతం
- ప్రధాని మోదీ హయాంలో కోతలు లేని విద్యుత్
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జీ కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): ప్రస్తుతం అవసరాలకు సరిపడ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో ఇక్కడే ఉత్పత్తి పెంచుతామని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురు వారం ఢిల్లీలో కేంద్రమంత్రిగా బాధ్య తలు స్వీకరించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ తనకు రెండు శాఖలను అప్పగించి పెద్ద బాధ్యతలిచ్చారని అన్నారు.
ఇప్పటి వరకు ప్రహ్లాద్ జోషి, అంతకు ముందు పీయూష్ గోయల్ అద్భుతంగా పనిచేశారని వారిలా తాను విధులు నిర్వర్తి స్తానని తెలిపారు. ప్రజల జీవితాల్లో విద్యుత్ రంగం కీలకంగా ఉన్నదన్నారు. పదేండ్ల క్రితం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండే దని, హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తలు సమ్మె చేసిన ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. కరెంట్, నీళ్ల కొరత ఉండేదని, పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తిందని గుర్తుచేసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో ప్రధాని మోదీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారని తెలిపారు.
దేశంలో ఉన్న ఖనిజాలను బయటకు తీయడం, ఉపాధి అవకాశాలను పెంచ డానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఖనిజాలను ఇతరదేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామని వెల్లడించారు. శక్తివంతమైన భారత్‌ను రూపొందించడంలో బొగ్గు, మైనింగ్ శాఖల పాత్ర కీలకమని, దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.






