బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగొద్దు
వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలి
జీఎంలకు సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశం
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ సూచనల నేపథ్యంలో వర్షాకాలంలోనూ సింగరే ణిలో బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంక మూ కలుగకుండా చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలోనూ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగి నంత బొగ్గును సరఫరా చేయాలన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు శనివారం అన్ని ఏరియాలలోని జనరల్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 95 శాతం బొగ్గు ఓపెన్ కాస్ట్ గనుల నుంచి వస్తోందని, భారీవర్షాలు కురిసినప్పుడు ఓపెన్ కాస్ట్ గ నుల్లో నీరు నిలువ ఉండి ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందన్నారు. అయితే నీటిని బయటకు తోడి ఉత్పత్తిని కొనసాగించేందుకు సింగరేణి సంస్థ ఇప్పటికే అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో 100కు పైగా భారీ పంపులను, మో టార్లను ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా నీటిని తవ్వి బయటకు పోస్తున్నారని పేర్కొన్నారు.
అయితే భారీ వర్షాల వల్ల నీటి పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉన్నందున కంపెనీ పంపులతో పాటు కొన్ని ప్రైవే టు పంపులను కూడా ఏర్పాటు చేసి ఓవర్ బర్డెన్, బొగ్గు బెంచీల వద్ద నీరు నిలు వ లేకుండా చూడాలన్నారు. హాల్ రోడ్లను పటిష్టపరచుకోవాలని ఏరియా జీఎంలను ఆదేశించారు. తగినన్ని పంపులను సమకూర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవా లని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం కా ర్పొరేట్ కార్యాలయంలోని సంబంధిత జీఎంలు టెండర్లకు సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికల గురించి కూడా ఆయన గనులవారీగా చర్చించారు. అంతర్జాతీయ పరిణా మాల నేపథ్యంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో సింగరేణితో ఇం ధన సరఫరా ఒప్పందం ఉన్న థర్మల్ విద్యు త్ కేంద్రాలకు బొగ్గును యథావిధిగా కొనసాగించడానికి అన్ని ఏరియాల లోని యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్‌వీ సూర్య నారాయణ, డైరెక్టర్ ప్రాజెకట్స్ అండ్ ప్లానింగ్ కే వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ గౌతమ్ పోట్రు, డైరెక్టర్ ఈ అండ్ ఎమ్ ఎం.తిరుమలరావు, ఈడీ(కోల్ మూవ్మెంట్) బీ వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






