09-12-2025 12:00:00 AM
జవహర్ నగర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : ప్రజాపాలనలో భాగంగా పేదలకు అండగా నిలుస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉంటున్న పుట్ట కవిత అనారోగ్యంతో బాధపడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో ఆమెకు రూ. 41 వేల చెక్కు మంజూరైంది.
ఈ చెక్కును మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల కష్టాలు తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. తోటకూర వజ్రేష్ యాదవ్ గారి చొరవతో నియోజకవర్గంలోని బాధితులకు త్వరితగతిన సహాయం అందుతోందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పసుపులేటి భాస్కరరావు, సత్యనారాయణ, నారాయణ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.