వన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, సీపీ
26-08-2026 02:13 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 25 (విజయక్రాంతి): వన మహోత్సవంలో భాగంగా కరీంనగర్ పట్టణం ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. విద్యార్థు ల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహ ద పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజ అజయ్, వన్టౌన్, టూటౌన్ ఇన్స్పెక్టర్లు రామచందర్రావు, సృజన్రెడ్డి, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






